« నీతో సమమెవరు నీలా ప్రేమించేదవరు
Neetho samamevaru neela
share with whatsapp

పల్లవి:
నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు   
నీలా క్షమియించేదెవరు – యేసయ్యా   
నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు    (2X)
1.
లోక బంగారము – ధన ధాన్యాదులు   
ఒక పోగేసినా – నీతో సరితూగునా   
జీవ నదులన్నియు – సర్వ సంద్రములు   
ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా   
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన   
నీవేగా చాలిన దేవుడవు   
...నీతో...
2.
పలు వేదాలలో – మత గ్రంథాలలో   
పాపమే సోకని – పరిశుద్దుడేడి   
పాప పరిహారార్థం – సిలువ మరణమొంది   
తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు   
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా   
నీవేగా మంచి దేవుడవు   
...నీతో...
3.
నేను వెదకకున్నా – నాకు దొరికితివి   
నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి   
పలు గాయాలు చేసి – తరచు రేపితిని   
నన్నెంతో సహించి – క్షమియించితివి   
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి   
నీవేగా విమోచకుడవు   
...నీతో...